జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో ప్రజల మద్దతు కాంగ్రెస్ పార్టీకే ఉందని షాద్ నగర్ గిరిజన నేత శ్రీను నాయక్ అన్నారు. మంగళవారం సోమాజిగూడ డివిజన్, వెంకటగిరి కాలనీ, ఐలమ్మ కాలనీలలో ఎఐసిసి ఇన్చార్జ్ మీనాక్షి నటరాజ్, మంత్రి పొన్నం ప్రభాకర్, రికార్డు చైర్మన్ బెల్లయ్య నాయక్ లతో కలిసి ఆయన ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. మీనాక్షి నటరాజన్, పొన్నం ప్రభాకర్, బెల్లయ్య నాయక్ ల ప్రచారంతో పార్టీకి ఊపు వచ్చిందని, ప్రజల నుంచి అపూర్వమైన స్పందన లభించిందని, మంగళహారతులతో మద్దతు తెలిపారని శ్రీను నాయక్ తెలిపారు.