మహిళపై రాపిడో డ్రైవర్ వేధింపులు.. స్పందించిన కంపెనీ

బెంగళూరులో ర్యాపిడో ఆటో డ్రైవర్ మహిళను అసభ్యంగా వేధించిన ఘటన బయటపడింది. సెప్టెంబర్ 8న కుమారస్వామి లే అవుట్‌లో హనుమంతప్ప హెచ్ తలావర్ అనే డ్రైవర్ ప్రయాణికురాలిపై అసభ్య ప్రవర్తనకు పాల్పడగా, బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సంఘటనపై ర్యాపిడో సంస్థ స్పందించింది. బెంగళూరులో జరిగిన సంఘటన తీవ్రంగా కలచివేసిందని, డ్రైవర్‌ను శాశ్వతంగా సస్పెండ్ చేసి, భవిష్యత్తులో రైడ్లు తీసుకోకుండా బ్లాక్‌లిస్ట్‌లో చేర్చినట్లు ప్రకటించింది.

సంబంధిత పోస్ట్