బెంగళూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఫేమస్ రియాలిటీ షో డ్యాన్సర్ సుధీంద్ర మృతి చెందారు. కారులో సమస్య ఉండటంతో హైవేపై ఆపి పరిశీలిస్తుండగా.. వెనుక నుంచి దూసుకొచ్చిన ట్రక్కు ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాలైన సుధీంద్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. నిద్ర మత్తులో ట్రక్కు నడిపిన డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.