భారతదేశం మరోసారి భారీ పెళ్లి సీజన్‌కు సిద్ధమవుతోంది. నవంబర్ 1 నుంచి ప్రారంభం కానున్న 45 రోజుల పెళ్లిళ్ల సీజన్‌లో దేశవ్యాప్తంగా సుమారు 46 లక్షల వివాహాలు జరగనున్నాయని సీఏఐటీ (CAIT) తాజా నివేదిక వెల్లడించింది. ఈ సీజన్ ద్వారా దేశ వ్యాప్తంగా దాదాపు ₹6.5 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుందని, ఇది ఇప్పటివరకు నమోదైన అత్యధిక రికార్డు అని పేర్కొంది.