తగ్గిన వెజ్‌, నాన్‌వెజ్‌ థాలీ ధరలు

ఆగస్టులో వెజ్‌ థాలీ ధరలు 7%, నాన్‌ వెజ్‌ థాలీ ధరలు 8% తగ్గాయని క్రిసిల్‌ నివేదిక తెలిపింది. ఉల్లిపాయ 37%, బంగాళాదుంప 31%, పప్పు 14% చవక కావడం ఇందుకు ప్రధాన కారణం. బ్రాయిలర్ చికెన్ ధరలు కూడా 10% తగ్గడంతో నాన్‌ వెజ్‌ థాలీపై ప్రభావం పడింది. అయితే నెలవారీ ప్రాతిపదికన వెజ్‌ 4%, నాన్‌ వెజ్‌ 2% పెరిగాయి. జులై రిటైల్‌ ద్రవ్యోల్బణం 1.55%కి తగ్గి 2017 జూన్‌ తర్వాత కనిష్ట స్థాయికి చేరింది.

సంబంధిత పోస్ట్