పెద్దలు, పిల్లలు అనే తేడా లేకుండా ప్రాణాలను పణంగా పెట్టి రీల్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఓ యువకుడు రైలు వస్తున్న సమయంలో ప్రమాదకరంగా రైల్వే ట్రాక్‌పై పడుకున్నాడు. దీన్ని తోటి యువకులు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియాల్సి ఉంది. దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.