జాతీయ పెన్షన్ వ్యవస్థ (NPS) అక్టోబర్ 1, 2025 నుండి పెద్ద మార్పులకు లోనవుతుంది. ఇకపై ప్రభుత్వేతర చందాదారులు తమ పెన్షన్ మొత్తాన్ని 100% ఈక్విటీ పథకాలలో పెట్టుబడి పెట్టొచ్చు. గతంలో ఈ పరిమితి 75% మాత్రమే. ఇంకా ప్రైవేట్ రంగ ఉద్యోగులు PRAN తెరవడానికి రుసుము చెల్లించాలి. కొత్తగా e-PRAN కిట్‌కి రూ.18, ఫిజికల్ కార్డు కోసం రూ.40 వసూలు చేస్తారు. వార్షిక మెయింటెనెన్స్ ఛార్జ్ రూ.100గా నిర్ణయించారు.