ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ నిబంధనల సడలింపు

TG: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ నిబంధనలను ప్రభుత్వం సడలించింది. పట్టణ ప్రాంతాల్లో ఇళ్లు నిర్మించుకోవాలంటే లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో క్షేత్రస్థాయిలో పరిస్థితులను గమనించిన ప్రభుత్వం తాజాగా పట్టణ ప్రాంతాల్లో నిబంధనలకు అనుగుణంగా ఇంటి నిర్మాణ స్థలం అనువుగా లేకున్నా, జీ ప్లస్ వన్ గా నిర్మించుకోవచ్చని నిబంధనలు సడలించింది. దీంతో పురపాలికల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో పురోగతిని సాధించడానికి అవకాశం ఉందని హౌసింగ్ అధికారులు అభిప్రాయపడుతున్నారు.

సంబంధిత పోస్ట్