గుండెపోటుతో రిటైర్డ్‌ మహిళా డాక్టర్‌ మృతి

TG: హైదరాబాద్‌లో నివసించే 76 ఏళ్ల రిటైర్డ్ మహిళా డాక్టర్ 'డిజిటల్ అరెస్ట్' పేరుతో సైబర్ నేరగాళ్ల వేధింపులకు గురై గుండెపోటుతో మరణించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బెంగళూరు పోలీసులమని సైబర్ నేరగాళ్లు నకిలీ పత్రాలు చూపించి 3 రోజుల పాటు వీడియో కాల్స్ ద్వారా బెదిరించారు. దీనితో భయపడిన ఆమె తన పెన్షన్ ఖాతా నుండి రూ.6.6 లక్షలు వారికి ఇచ్చారు. ఈ ఒత్తిడితో ఆమె గుండెపోటుకు గురై మృతి చెందారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్