TG: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఫ్యూచర్ సిటీకి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆగస్టు 15 నాటికి ఫ్యూచర్ సిటీ కోసం వెబ్‌సైట్‌ను రూపొందించాలని ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ తరహాలో ఉండే ఈ వెబ్‌సైట్‌లో ప్రభుత్వ, ప్రైవేటు, పరిశ్రమలకు సంబంధించిన సమస్త సమాచారం అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు. అనుమతుల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించబోతున్నట్లు పేర్కొన్నారు.