TG: కాంగ్రెస్ పార్టీ లేకుంటే ముస్లింలు లేరనే భ్రమలో నుంచి సీఎం రేవంత్ రెడ్డి బయటకు రావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బుధవారం జూబ్లీహిల్స్ ప్రగతి నివేదిక కార్యక్రమంలో మాట్లాడుతూ.. 'కాంగ్రెస్ పార్టీ పుట్టక ముందు నుండి ముస్లింలు ఉన్నారు. రేపు కాంగ్రెస్ పార్టీ కనుమరుగైనా ముస్లింలు ఉంటారు. రేవంత్ రెడ్డి ఈ అడ్డగోలు మాటలు మాట్లాడడం మానుకోవాలి' అని హితవు పలికారు.