పాట్నాలో ఆర్జేడీ (RJD) నేత రాజ్‌కుమార్ రాయ్ అలియాస్ అల్లాహ్ రాయ్ బుధవారం రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. మున్నాచక్ ప్రాంతంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై కాల్పులు జరిపారు. గాయాలతో ఉన్న ఆయనను ఆసుపత్రికి తరలించగా వైద్యులు మృతి చెందినట్టు ప్రకటించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన రాఘోపూర్ నుంచి పోటీ చేయనున్నారని సమాచారం. భూవివాదమే కారణమై ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.