TG: హైదరాబాద్‌లోని శంషాబాద్ సమీపంలోని పెద్ద షాపూర్ వద్ద ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మితిమీరిన వేగంతో వెళ్తున్న బైక్ అదుపు తప్పి పడిపోవడంతో ఇద్దరు యువకులు మృతి చెందారు. మృతులు మధన్‌పల్లికు చెందిన అఖిల్, చింటూగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. మృతదేహాలను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.