భారత వన్డే జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ అభిమానులపై అసహనానికి గురయ్యారు. రోహిత్ శర్మ వినాయకుడి పూజ కోసం ముంబయిలోని ఓ మండపం వద్దకు వెళ్లారు. దీంతో అక్కడి అభిమానులు రోహిత్ శర్మ పేరును పెద్ద ఎత్తున నినదించారు. దీనిపై రోహిత్ శర్మ స్పందించి.. వినాయకుడి మండపం వద్ద తన పేరు ఎందుకంటూ అభిమానులపై అసహనం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.