టీమ్‌ఇండియా వన్డే జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ గణపతి పూజల కోసం ముంబై వర్లికి వెళ్లగా, ఆయన కారును అభిమానులు చుట్టుముట్టారు. దీంతో రోహిత్ సన్‌రూఫ్ నుంచి బయటకు వచ్చి చేతులు ఊపుతూ ఫ్యాన్స్‌కు అభివాదం చేశాడు. ఆయనను చూసి అభిమానులు 'ముంబై రాజా' అంటూ నినాదాలు చేశారు. రోహిత్ కారు కష్టంగా ముందుకు కదిలింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.