TG: రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగలు పట్టపగలే సుమారు రూ.2.98 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. ఎర్వగూడ గ్రామానికి చెందిన ప్రదీప్ గౌడ్ బ్యాంకులో క్యూ ఎక్కువగా ఉండటంతో డబ్బులు ద్విచక్ర వాహనం డిక్కీలో పెట్టి ల్యాబ్‌కు వెళ్లగా, గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు డిక్కీ తెరిచి నగదు దొంగిలించారు. పోలీసులుకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.