నిరుద్యోగులకు నెలకు రూ.2500.. క్లారిటీ

‘బెరోజ్‌గరి భట్ట యోజన 2025’ పథకం కింద నిరుద్యోగులకు కేంద్రం నెలకు రూ.2500 అందిస్తుందని ఇటీవల ఓ వార్త జోరుగా ప్రచారం జరిగింది. అయితే ఇందులో నిజం లేదని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ ధ్రువీకరించింది. కేంద్ర ప్రభుత్వం కింద అలాంటి నిరుద్యోగ భృతి పథకం లేదని స్పష్టం చేసింది. గతంలో కూడా నిరుద్యోగులకు నెలకు రూ.3500 ఇస్తున్నట్లు వైరల్ అయింది. నకిలీ వార్తలను నమ్మి మోసపోవద్దని సూచించింది.

సంబంధిత పోస్ట్