రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) ఏర్పాటు చేసి నేటికి వందేళ్లు అయ్యింది. డాక్టర్ కేశవ్ బలిరాం హెడ్గేవర్ 1925 సెప్టెంబర్ 27న విజయదశమి రోజు 17 మందితో కలిసి సంస్థను స్థాపించారు. హిందువుల ఐక్యత, క్రమశిక్షణ, వ్యక్తిత్వ నిర్మాణం లక్ష్యంగా ఏర్పడిన ఆర్ఎస్ఎస్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా 83 వేల శాఖలతో, లక్షలాది వాలంటీర్లతో విస్తరించింది. శతాబ్ది సందర్భంగా ఏడాది పాటు వేడుకలు జరగనున్నాయి.