శ్రీశైలం ఘాట్ రోడ్డుపై అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు

TG: నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలోని నల్లమల అడవి ప్రాంతంలో గల ఘాట్ రోడ్డుపై అక్కమ దేవి మలుపు వద్ద ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు అదుపుతప్పింది. బుధవారం ఉదయం హైదరాబాద్ వైపు నుండి శ్రీశైలం వెళుతున్న ఆర్టీసీ బస్సు అతి వేగంగా వెళ్లడంతో మూల మలుపు వద్ద కంట్రోల్ కాక రోడ్డుపై అడ్డం తిరిగినట్లు ప్రాథమిక సమాచారం. అయితే ఈ ఘటనలో బస్సులో ఉన్న వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్