భారతీయులకు గుడ్‌న్యూస్ చెప్పిన రష్యా.. 10 లక్షల మందికి ఉద్యోగాలు

రష్యాలో కార్మికుల కొరత పెరగడంతో భారతీయులకు ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరుగుతున్నాయి. రష్యా ఈ ఏడాది చివరినాటికి 10 లక్షల మంది భారతీయులకు ఉద్యోగాలు కల్పించనున్నట్లు భారత రాయబారి వినయ్‌కుమార్ తెలిపారు. ప్రస్తుతం నిర్మాణం, టెక్స్టైల్స్ రంగాల్లో ఎక్కువగా భారతీయులు పనిచేస్తుండగా, ఇప్పుడు యంత్రాలు, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో కూడా డిమాండ్ పెరుగుతోందని చెప్పారు. రష్యా–భారత్ సంబంధాలు ఎప్పటిలాగే మైత్రీపూర్వకంగానే కొనసాగుతున్నాయని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్