చైనాకు చెందిన 'సాల్ట్ టైఫూన్' హ్యాకింగ్ ముఠా అమెరికాపై విపరీతమైన సైబర్ దాడులు జరిపినట్టు దర్యాప్తులో తేలింది. దాదాపు ప్రతి పౌరుడి వ్యక్తిగత సమాచారం చైనా చేతికి చిక్కి ఉండవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 2019 నుంచి 80 దేశాల్లో 200కి పైగా కంపెనీలను లక్ష్యంగా చేసుకున్న ఈ గ్రూప్ ప్రధానంగా టెలికాం నెట్‌వర్క్‌లలోకి చొరబడింది. చైనా ప్రభుత్వ మద్దతుతోనే ఈ దాడులు జరుగుతున్నాయని.. అమెరికా, బ్రిటన్‌తో పాటు పలు దేశాలు దీన్ని ప్రపంచ భద్రతకు పెను ముప్పుగా పేర్కొన్నాయి.