సద్దుల బతుకమ్మతో జోగిపేటలో సంబరాలు

జోగిపేట పట్టణంలో ఆదివారం సద్దుల బతుకమ్మ పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. వివిధ రకాల పూలతో అలంకరించిన బతుకమ్మలను మహిళలు, యువతులు, చిన్నారులు గల్లీల్లో ఒకచోట చేర్చి ఆటపాటలతో సంబరాలు చేసుకున్నారు. అనంతరం ఆందోల్ చెరువు వద్ద గౌరమ్మను పూజించి, బతుకమ్మలను గంగమ్మ ఒడికి చేర్చారు. మహిళలు ఒకరికొకరు వాయినాలు ఇచ్చిపుచ్చుకుని, తీర్థ ప్రసాదాలు స్వీకరించి, అమ్మవారి ఆశీస్సులు కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్