జంగం రెడ్డి పల్లి రాముని బండ: పురుగుల నివారణ, శారీరక రుగ్మతల తొలగింపుతో ప్రసిద్ధి

జగదేవ్పూర్ మండలం పరిధిలోని జంగం రెడ్డి పల్లిలో ఉన్న రాముని బండ ఆలయం పురుగుల నివారణకు, చిన్న పిల్లల్లో శారీరక రుగ్మతలను తొలగించడానికి ప్రసిద్ధి చెందింది. ఆలయ అర్చకుల ప్రకారం, రాముని బండ స్వయంభువుగా వెలిసింది. తెలంగాణలో భద్రాచలం, జీడికల్ తో పాటు రాముని బండలో రాముడు వెలిశాడు. సీతారాముల కాలంలో శ్రీ సీతారాములు, లక్ష్మణులు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు, దాహం తీర్చడానికి రామలక్ష్మణులు బాణాలతో తాటి చెట్టు అంత లోతుగా త్రవ్వి చల్లని తీయని నీళ్లను వెలికితీశారని కథనం. ఆలయ అభివృద్ధికి దాతల సహకారం కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్