శుక్రవారం మునిపల్లి మండలం కంకోల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను అకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ ప్రావిణ్య, పదో తరగతిలో 100% ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. విద్యార్థులకు కంప్యూటర్ బోధన తప్పనిసరి చేయాలని, చదువులో వెనుకబడిన వారిని గుర్తించి ప్రత్యేకంగా బోధించాలని ఆమె పేర్కొన్నారు.