సింగూరు ప్రాజెక్టు 3 గేట్లను ఎత్తి దిగువకు 23, 918 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు డీఈఈ నాగరాజు తెలిపారు. ప్రాజెక్టుకు ఎగువ నుంచి 26, 313 క్యూసెక్కుల వరద వస్తోందని, ప్రాజెక్టు ఆనకట్ట భద్రత దృష్ట్యా, సీటి స్టోరేజీ లిమిట్ సందర్భంగా 12, 15వ గేట్లు 1.5 మీటర్ల ఎత్తులో, 14వ నంబర్ గేటు 2 మీటర్ల ఎత్తు పైకి లేపి దిగువకు నీటిని విడుదల చేసినట్లు ఆయన వివరించారు.