మనోహరాబాద్ మండలంలోని ముప్పిరెడ్డిపల్లి గ్రామశివారులో నకిలీ ఫోన్ పే, యాప్‌ల ద్వారా దుకాణదారులను మోసం చేస్తున్న ఇద్దరు వ్యక్తులను స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేశారు. మేడ్చల్ కు చెందిన స్వామి, బండ తిమ్మాపూర్ కు చెందిన సాయి అనే వ్యక్తులు కిరాణా దుకాణాల్లో సామాగ్రి కొనుగోలు చేసి, నకిలీ ఫోన్ పే ద్వారా డబ్బులు చెల్లించి, ద్విచక్ర వాహనంపై పారిపోతున్నారని దుకాణదారులు తెలిపారు. బుధవారం ఉదయం వారిని పట్టుకుని ఫోన్లు స్వాధీనం చేసుకుని దేహశుద్ధి చేశారు. ఇలాంటి మోసాలు చాలా కాలంగా జరుగుతున్నాయని, తాము చాలా నష్టపోయామని దుకాణ యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు.