అట్ల బతుకమ్మ సంబరాలు: కంగ్టిలో ఘనంగా మహిళల ఆటపాటలు

నారాయణఖేడ్ నియోజకవర్గం కంగ్టి మండలంలోని వివిధ గ్రామాల్లో ఆదివారం అట్ల బతుకమ్మ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. కంగ్టిలోని పలు వాడల్లో బాలికలు, మహిళలు బతుకమ్మ ఆటలు ఆడారు. సేకరించిన పూలతో బతుకమ్మను అందంగా తయారుచేసి పూజలు చేశారు. ప్రధాన కూడలిలో బతుకమ్మలు ఉంచి వాటి చుట్టూ తిరుగుతూ కోలాటాలు ఆడారు. 'బంగారు బతుకమ్మలు ఇంటిలో పెట్టి' మ్యూజిక్ సాంగ్ పై చిన్నారి బాలికలు నృత్యాలు చేశారు. అనంతరం బతుకమ్మలో నిమజ్జనం చేశారు.

సంబంధిత పోస్ట్