మనూర్ మండలంలో నిన్న మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు కురిసిన భారీ వర్షం కారణంగా ఎల్గోయి, అతిమేల గ్రామాల్లోని పత్తి పంటలు పూర్తిగా నీట మునిగిపోయాయి. దీంతో రైతులు తమ పంట చేతికి వస్తుందన్న ఆశను కోల్పోయారు. మండలంలోని అనేక ప్రాంతాల్లో పత్తి పంటలు ఇలాగే దెబ్బతిన్నాయి. వ్యవసాయ అధికారులు నష్టాన్ని అంచనా వేయడానికి పొలాలను పరిశీలిస్తున్నారు.