నారాయణఖేడ్ డివిజన్ పరిధిలో ఆదివారం ఉదయం వరకు భారీ వర్షాలు కురిశాయి. మనూర్ మండలంలో అత్యధికంగా 91.6 మి.మీ వర్షపాతం నమోదైంది. నాగలిగిద్దలో 52.0 మి.మీ, నారాయణఖేడ్‌లో 29.8 మి.మీ, కంగ్టిలో 18.8 మి.మీ, కల్హెర్‌లో 7.4 మి.మీ, సిర్గాపూర్, నిజాంపేట మండలాల్లో 2.0 మి.మీ వర్షం కురిసినట్లు అధికారులు తెలిపారు.