సంగారెడ్డి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజల భద్రతకు తక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. ఆర్డీవోలు, తహశీల్దార్లు, నీటిపారుదల, మున్సిపల్, వైద్య ఆరోగ్యశాఖ, అగ్నిమాపక శాఖ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో, నిత్యం అప్రమత్తంగా ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనించాలని సూచించారు. ప్రజలు సురక్షితంగా ఉండేలా చూడటమే ప్రధాన లక్ష్యంగా అధికారులు పనిచేయాలని స్పష్టం చేశారు.