మార్కండేయ మందిరంలో కొండా లక్షణ్ బాపూజీ 110వ జయంతి వేడుకలు

నారాయణఖేడ్ లోని భక్త మార్కండేయ మందిరంలో కొండా లక్షణ్ బాపూజీ 110వ జయంతి వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పద్మశాలియులు మాట్లాడుతూ కొండా లక్షణ్ బాపూజీ భారత స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నారని, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో తొలి మంత్రిగా పని చేశారని తెలిపారు. 1969 మార్చి 29న తెలంగాణ కోసం ఆయన పదవికి రాజీనామా చేశారని, అదే ఏడాది తెలంగాణ ఉద్యమ ఆందోళనకు మద్దతుగా పోరాటంలో పాల్గొన్నారని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి కుల బంధువులు, యువకులు, ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్