నారాయణఖేడ్ నియోజకవర్గం మనూర్ మండల పరిధిలోని బోరంచ గ్రామంలోని శ్రీ నల్ల పోచమ్మ ఆలయంలో శ్రీ దేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా, ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి అమ్మవారిని మహాశక్తి శ్రీ మహాచండీ దేవి రూపంలో దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. ఆయనతో పాటు భోజీ రెడ్డి, గుండె రావు పాటిల్, ఆలయ కమిటీ అధ్యక్షుడు మల్లప్ప, ఆలయ ఏవో శివరుద్రప్ప తదితర నాయకులు కూడా అమ్మవారిని దర్శించుకున్నారు.