నారాయణఖేడ్: దేవి నవరాత్రి ఉత్సవాల్లో ఎంపీ దంపతుల అమ్మవారి దర్శనం

నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలోని సత్య సాయి కాలనీలో జరుగుతున్న దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా, కట్ట మైసమ్మ ఆలయంలో ఏడవ రోజు మహా చండీ దేవి రూపంలో అమ్మవారి దర్శనం లభించింది. ఈ సందర్భంగా జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ శెట్కార్, ఉమాదేవి శెట్కార్ దంపతులు, మాజీ జడ్పీటీసీ సంగీత జిత్తు శెట్కార్ అమ్మవారిని దర్శించుకుని ఒదిబియ్యం, పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆలయ కమిటీ అధ్యక్షులు ప్రభాకర్ ఎంపీ దంపతులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్