భగత్ సింగ్ జయంతి సందర్భంగా నారాయణఖేడ్‌లో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి దత్తు రెడ్డి మాట్లాడుతూ, భగత్ సింగ్ దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని, యువత, విద్యార్థులు ఆయన స్ఫూర్తిని తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.