స్థానిక ఎంపీటీసీ, జడ్పీటీసీ, పంచాయతీ ఎన్నికల్లో ఎస్సీలకు రిజర్వేషన్ కల్పించడాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు పండరి ఆదివారం ప్రశంసించారు. కంటి మండలంలో సుమారు 6 గ్రామాలను ఎస్సీలకు కేటాయించడంపై వారు సంతోషం వ్యక్తం చేశారు. వెనుకబడిన తరగతుల వారికి రాజకీయ ప్రయోజనం కల్పించడంపై హర్షం వ్యక్తం చేస్తూ, అందుకు రేవంత్ రెడ్డి, నారాయణపేట ఎమ్మెల్యే సంజీవరెడ్డి, ఎంపీ సురేష్ కుమార్ శెట్టిలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.