సంగారెడ్డి జిల్లాలో నవంబర్ 1 నుంచి 30వ తేదీ వరకు పోలీస్ యాక్ట్ 30, 30(ఎ) అమలులో ఉంటుందని ఎస్పీ పరితోష్ పంకజ్ శుక్రవారం తెలిపారు. పోలీసుల అనుమతి లేకుండా ఎలాంటి ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని ఆయన స్పష్టం చేశారు. ఈ నిబంధనలను పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ ఉత్తర్వులు జిల్లా వ్యాప్తంగా వర్తిస్తాయి.