నారాయణఖేడ్ లో కార్పెంటర్లకు శిక్షణ, భద్రతా చర్యలపై సూచనలు

నారాయణఖేడ్ పట్టణంలోని కరస్ గుత్తి రోడ్ లో గల శివ వుడ్ వర్క్ షాప్ లో, గ్రామోద్యోగ్ వికాస్ యోజన (ఖాదీ) ఆధ్వర్యంలో కార్పెంటర్లకు 13వ రోజు శిక్షణ కార్యక్రమం గురువారం మధ్యాహ్నం జరిగింది. ఈ సందర్భంగా నారాయణఖేడ్ ఇంచార్జ్ నగేష్ సార్, వడ్ల జ్ఞానేశ్వర్ ల సమక్షంలో, దుగడ మిషన్, ఫుడ్ టర్నింగ్ మిషన్, తొల్ల మిషన్, కార్వింగ్ మిషన్ వంటి యంత్రాలపై పనిచేసే కార్పెంటర్లకు గగుల్స్, చేతి బ్లౌజులు, సేఫ్టీ బెల్ట్ లు ధరించాలని, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామెద్యోగ్ వికాస్ యోజన కార్పెంటర్ సభ్యులందరూ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్