తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి

పాశ మైలారం పారిశ్రామిక వాడలోని బిస్లరీ పరిశ్రమలో యూనియన్ పెట్టుకుంటే కార్మికులను తొలగించడం సరికాదని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు మాణిక్యం బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. విధుల్లో నుంచి తొలగించిన ఐదుగురు కార్మికులను వెంటనే తిరిగి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. యూనియన్ పెట్టమని బాండ్ పేపర్‌పై సంతకాలు చేయాలని యాజమాన్యం కార్మికులను మానసికంగా ఒత్తిడికి గురిచేస్తుందని ఆయన ఆరోపించారు.

సంబంధిత పోస్ట్