జిల్లాలోని 37 పీఎంశ్రీ పాఠశాలల్లో కరాటే శిక్షణ అందించేందుకు ఏజెన్సీల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శుక్రవారం తెలిపారు. కొంగ్ ఫు, జోడో, కలరిపయట్టు వంటి యుద్ధ కళలను నేర్పించగల ఏజెన్సీలు ఈనెల 3వ తేదీ లోపు కలెక్టరేట్ లోని రెండో అంతస్తులో ఉన్న సమగ్ర శిక్ష కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎంపికైన ఏజెన్సీలు విద్యార్థులకు కరాటే శిక్షణ ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు.