సంగారెడ్డి పట్టణంలో ఆదివారం ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి ఆధ్వర్యంలో భగత్ సింగ్ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఫోరం అధ్యక్షులు శ్రీధర్ మహేంద్ర, ఉపాధ్యక్షుడు మహేష్ కుమార్, కార్యదర్శి సబ్జ్జత్ ఖాన్, సహ కార్యదర్శులు పాండురంగం, మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు.