సంగారెడ్డి పట్టణంలోని సాగర్ చెరువు కట్టపై వినాయక నిమజ్జన ఏర్పాట్లను కలెక్టర్ ప్రావీణ్య శనివారం రాత్రి పరిశీలించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నిమజ్జన కార్యక్రమాన్ని సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షించాలని పోలీసులకు సూచించారు. తెల్లవారుజాము వరకు నిమజ్జనం జరిగే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ తెలిపారు.