ఫసల్ వాది శివారులోని శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో ఆదివారం ఉచిత కీబోర్డ్, తబలా శిక్షణ కార్యక్రమం జరిగింది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు శిక్షకులు శిక్షణ ఇచ్చారు. అందరూ కీబోర్డ్, తబలా నేర్చుకోవాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి తెలిపారు.