గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జాతీయ రహదారికి ఇరువైపులా పేరుకుపోయిన మట్టిని జాతీయ రహదారి సిబ్బంది తొలగించారు. ఈ మట్టి వాహనదారులకు, పాదచారులకు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు కలిగించింది. మట్టి తొలగింపుతో వాహనాలు జారిపడకుండా ప్రమాదాలు తగ్గుతాయని, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారని తెలిపారు. ఈ చర్యకు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.