కందిలోని ఓ ఫంక్షన్ హాలులో జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో శనివారం బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా హాజరైన జిల్లా జడ్జి భవాని చంద్ర, కలెక్టర్ ప్రావీణ్య మహిళా పోలీసులతో కలిసి బతుకమ్మ ఆడారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రఘునందన్ రావు కూడా పాల్గొన్నారు.