కంది మండలం చేర్యాల గ్రామంలోని సర్వేనెంబర్ లోని ఆరు ఎకరాల అసైన్ మెంట్ భూమిని తహసిల్దార్ రవికుమార్ ఆధ్వర్యంలో శనివారం స్వాధీనం చేసుకున్నారు. గతంలో ఇద్దరు రైతులకు కేటాయించిన ఈ భూమిని ఒక వ్యక్తికి విక్రయించడంతో రెవెన్యూ అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. తహసిల్దార్ మాట్లాడుతూ ప్రభుత్వ, అసైన్ మెంట్ భూముల విషయంలో కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.