కొండాపూర్: మారేపల్లిలో బతుకమ్మ సంబరాలు

కొండాపూర్ మండలం మారేపల్లి గ్రామంలోని లక్ష్మీ నారాయణ స్వామి దేవాలయంలో ఆదివారం రాత్రి బతుకమ్మ సంబరాలు అట్టహాసంగా జరిగాయి. మహిళలు 'బతుకమ్మ. బతుకమ్మ ఉయ్యాలో' అంటూ ఉత్సాహంగా ఆటపాటలతో అలరించారు. అనంతరం, గ్రామ సమీపంలోని చెరువులో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. ఈ వేడుకల్లో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్