కొండాపూర్ మండలం తెరిపోల్ గ్రామ శివారులో అకాల వర్షాలతో పంట నష్టపోయిన పొలాలను సీపీఎం నాయకులు శుక్రవారం పరిశీలించారు. రైతులతో మాట్లాడి, పంట నష్టం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి జయరాజ్ మాట్లాడుతూ, పంట నష్టపోయిన ప్రతి ఎకరానికి రూ. 40 వేలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు.