యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సాయిలు మంగళవారం సదాశివపేటలోని మైనార్టీ గురుకుల పాఠశాల ఆవరణలో జరిగిన మండల మహాసభలో మాట్లాడుతూ, ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సీనియర్ ఉపాధ్యాయులను టెట్ నుంచి మినహాయించాలని ఆయన కోరారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారమే తమ సంఘం లక్ష్యమని సాయిలు తెలిపారు.