సంగారెడ్డి మండలం ఫసల్వాది శివారులోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నివాసితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారి నుంచి వీధి దీపాలు లేకపోవడం, డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం, రోడ్లు అధ్వానంగా ఉండటం వంటి సమస్యలతో వారు అల్లాడుతున్నారు. రాత్రివేళల్లో బయటకు రావడానికి భయపడుతున్నామని, అధికారులు వెంటనే స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.