కొండాపూర్ మండలం గంగారం గ్రామానికి చెందిన నవీన్ కుమార్ కు మంగళవారం బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు విట్టల్, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేశారు. ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆదేశాల మేరకు ఈ చెక్కును పంపిణీ చేసినట్లు విట్టల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి, నాయకులు విక్రం, శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు.